Monday, September 09, 2024

అమ్మ చేతి పసుపు బొమ్మ

 అమ్మ చేతి పసుపు బొమ్మ

రచన : సామవేదం షణ్ముఖశర్మ గారు
సంగీతం : మల్లాది సూరిబాబు గారు
గానం : భమిడిపాటి లలితా మాధవ్ గారు

అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ
అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ

చరణం
మజ్జగాల నడిపించే గొజ్జు రూపు వేలుపూ 
ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జసామి ఇతడే
వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడూ ......
కొండంత దైవము చలి కొండ చూలి కొడుకూ
||అమ్మ చేతి ||

చరణం
పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడూ
ఒంటి పంటి దేవర మా కంటి రెప్ప ఇతడే
వంకరలను దునుమాడును వంకర తొండమ్ము వాడు
వంక చందురుడు సుమమై 
వరలిన శిగ వాడూ 
||అమ్మ చేతి ||

భలే ఎలక సవారీ

 భలే ఎలక సవారీ
 
 
రచన : దేవులపల్లి వేంకటక్రిష్ణశాస్త్రి గారు
 
సంగీతం : పాలగుమ్మి విశ్వనాధం గారు
 
పిల్లలు పాడిన పాట
 
 
LYRICS
 
భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో
 
చలో అంటు ప్రతీ ఇంట ఎలా తిరుగుతావో 
 
భలేవాడవీవూ
 
ఏదీ మాకు చూపించు ఏనుగ మొకమూ
 
ఏదీ చంద్రవంక వంటి ఏక దైతమూ
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో        ||భలే ఎలక || 
 
 
చరణం
 
తినాలంటె ఉండ్రాళ్ళూ తీయని అప్పాలూ
 
బనాయించి పోవచ్చూ పంచదార పాలూ
 
క్షణం ఉండు మా ఇంటా అదే కోటివేలూ
 
ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
సరే గాని వినాయకా చదువు సంధ్యలుంటయ్
 
మరీ మరీ పనులుంటయ్ ఆట పాటలుంటయ్ 
 
మరో సారి మనవులివే మాకు అడ్డు రాకూ
 
భరాయించుకోలేమూ పసివాళ్ళం బాబూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
ఫలం ఇచ్చుకుంటామూ పత్రి ఇచ్చుకుంటామూ
 
తలో పూవు కాళ్ళకాడ దాఖలు చేస్తామూ 
 
 
అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం
 
పొలోమంటు పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళూ        ||భలే ఎలక||
 


Saturday, August 31, 2024

శివ శివ శివ అనరాదా

 శివ శివ శివ అనరాదా

 

రచన : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు

సంగీతం : పాలగుమ్మి విశ్వనాథం గారు

గానం  : డా||మహాభాష్యం చిత్తరంజన్ గారు

వేదవతీ ప్రభాకర్ గారు

 

శివ శివ అనరాదా శివ నామము చేద 

శివ పాదము మీద  నీ శిరసు నుంచ రాదా 

భవసాగర మీద దుర్భర వేదన ఏదా

కరుణాళుడు కాదా ప్రభు చరణ ధూళి పడరాదా 

హర హర హర అంటే మన కరువు తీరి పోదా

 

||శివ శివ శివ ||

 

కరి,పురుగు,పాము,బోయ మొర లిడగా వినలేదా

కైలాసము దిగివచ్చి కైవల్యము ఇడలేదా

మదనాంతకు మీదా నీ మన సెన్నడు పోదా 

మమకారపు తెర స్వామిని మనసారా కన నీదా

 

||శివ శివ శివ ||

Saturday, May 11, 2024

వియ్యపురాలి మీద పాట

మంగళం జయామంగళం


Saturday, April 20, 2024

జానకీ రమణ - రామదాసు కీర్తన

రామదాసు కీర్తన


జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ ||

ఓనమాలు రాయగానే నీ నామమే తోచు | నీ నామమే తోచు శ్రీరామా ||

ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు | అందమె కానవచ్చు శ్రీరామా ||

ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి | మునులెల్ల మోహించిరి శ్రీరామా ||

దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో | దృష్టి తాకును ఏమో శ్రీరామా ||

ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే | నిన్నే భజింప నీవే శ్రీరామా ||

ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు | భక్తి మాత్రమే చాలు శ్రీరామా ||

రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా | నీ తిరువడిగళె కాదా శ్రీరామా ||

నారదాది మునులు పరమపద మందిరిగద | పరమపద మందిరిగా శ్రీరామా ||

సత్య స్వరూపముగ ప్రత్యక్షమైనావు | ప్రత్యక్షమై నావు శ్రీరామా ||

భద్రాచల నివాస పాలిత రామదాస | పాలిత రామదాస శ్రీరామా ||


నిరవధి సుఖద నిర్మల రూప

 నిరవధి సుఖద నిర్మల రూప - త్యాగరాజకీర్తన 


గానం: మధురై మణి అయ్యర్

రాగం: రవిచంద్రిక 

తాళం: ఆది

కోరిన సభ్యులు: శ్రీ వెలిదండి కాంతారావు



నిరవధి సుఖద నిర్మల రూప

నిర్జిత ముని శాప


శరధి బంధన నత సంక్రందన

శంకరాది గీయమాన సాధు మానస సు-సదన (నిర)


మామవ మరకత మణి నిభ దేహ

శ్రీ మణి లోల శ్రిత జన పాల

భీమ పరాక్రమ భీమ కరార్చిత

తామస రాజస మానవ దూర

త్యాగరాజ వినుత చరణ (నిర)


Friday, April 19, 2024

కలుగునా పద నీరజ సేవ

 కలుగునా పద నీరజ సేవ - త్యాగరాజ కీర్తన

గానం: రాజ్ కుమార్ భారతి

రాగం: పూర్ణ లలిత 

తాళం: ఆది


కలుగునా పద నీరజ సేవ

గంధ వాహ తనయ


పలుమారు జూచుచు బ్రహ్మానందుడై

పరగే భక్తాగ్రేసర తనకు (క)


వేకువ జామున నీ కరముననిడి

శ్రీ కాంతుడమృత స్నానము జేసి

పాకములను శ్రీ రంగేశుని-

కర్పణము జేసి తా

సీతా కరములచే భుజించి నిను

సాత్వీక పురాణ పఠన సేయమనే

సాకేత పతిని సర్వాధారుని

ప్రాకటముగ త్యాగరాజ నుతుని కన (క)


రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే

 రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే - అధ్యాత్మ రామాయణ కీర్తన - సుందర కాండ 


రఘుప్రవరు చరితము రాజముఖీ సఖీ వినవే ॥రఘు॥

అనుపల్లవి:

అఘప్రహారియౌ హనుమంతుఁ డవనిజాతకు నమస్కరించి వన-

విఘట్టనమునకుఁ గాని కాదు సురవిపక్షుని సమక్షమనుచుఁ దలఁచె ॥రఘు॥


చరణములు:

ఫలములు డుల్చి విరుల్‌ రాల్చి తరుపంక్తులుఁ బడఁగూల్చి యళి-

కులము జోపి పెరలు రేపి వాపీకూపజలముల యడుసుపైకిఁ దేల్చి

అల చిత్తరువు మేడ మరుత్తనయుఁ డాగ్రహమునఁ దన్ని నేలఁగలిపిన

కెలమి వారు రావణుని కెఱిఁగింపఁ గెరలి లక్ష రాక్షసభటులఁ బనిచె ॥రఘు॥


దండిమగలు గండుమిగిలి రాఁ గని గుండెలగల నార్చి గదా-

దండము గొని ఖండించె నగచరాఖండలుఁ డదివిని యమరారి పేర్చి

మండిపడి పంచసేనాధిపతులఁ జండకోపకాండ చాపధరులై

దండనాథులేవురు రాఁ గపి జముదండ కనిచె వారి రావణుండులికె ॥రఘు॥


దశముఖుఁడు సప్తమంత్రికుమారులఁ దగు వీరులఁ బంప వా

రసమశూలభిండివాలకరవాలాది సాధనముల ననిలజు నొంప

నసమానబలాఢ్యుఁడై యేడ్వురను గసిమసంగి తోరణస్తంభమున

వెసనుండె హతశేషుల వలన విని యసురేంద్రుఁ డక్షకుమారు ననిచె ॥రఘు॥


కరులు హరులు నరదములు భటు లసంఖ్యాతము లేతేర బం-

ధురకృపాణ తనుత్రాణసబాణతూణధనుర్ధరుఁడై యేపు మీఱ

నరిదివీరుఁడన నేఁగి యక్షుఁడు శరముల నొంప మారుతి యలిగి ము-

ద్గరముచే వ్రేసి యతనిఁ జంపి సైన్యమును ద్రుంచె రావణుఁడదియు వినె ॥రఘు॥


కనుల నశ్రుకణములు నెలుఁగున గద్గదిక యడరఁగాను రా-

వణుఁ డింద్రజిత్తు గని గజిబిజిగా వానరుఁడొకఁ డింతఁ జేసితేను

కని సహించుటెట్లు వానిఁ జంపెదననిన దేవ నీవు బోవనేటికి

వనచరుని బట్టి దెత్తు నిచటికని చనియె మేఘనాథుఁడు సేనతో ॥రఘు॥


వాలుబెలుకు గద విల్‌తూపుల వజ్రాలజోడు దాల్చి ర-

త్నాల సౌరుదేరు తేరు ధీరోన్నతినెక్కి చని సామీరి నదల్చి

వాలమ్ములైదెనిమిదాఱునొకటి ఫాలహృదయపదవాలమున నసుర

గీలింపఁ గనలి గరుడుఁడన నెగసి కీశవిభుఁడు గూల్చె రథరథ్యముల ॥రఘు॥


ఎంతవాఁడు వీఁడని వేఱొక తేరెక్కి బ్రహ్మాస్త్రము దనుజ-

కాంతుఁడేయ యంత డాసి యతిధీమంత హనుమంతు బంధించె క్షణము

సంతతమెవనిఁ బేర్కొనిన జనుల జ్ఞానకర్మబంధములూడి ముక్తి

గాంతురట్టి శేషగిరీశుఁడగు రాఘవదాసుని కితరబంధములెంత ॥రఘు॥


నారీమణీ వినవే యీ కథాసరణి

నారీమణీ వినవే యీ కథాసరణి - అధ్యాత్మ రామాయణ కీర్తన - సుందర కాండ

రాగం: వరాళి


నారీమణీ వినవే యీ కథాసరణి ॥నారీమణీ॥

అనుపల్లవి:

ఆ రాక్షసేశ్వరుపట్టి పట్టి తేరఁ గట్టుఁబడవచ్చువాని య-

ధీరాత్మునివలెఁ బురము గనువాని వీరహనుమంత్రు గ్రుద్దుచుఁ

బౌరులు చేరిరా బ్రహ్మాస్త్ర మొకలక్షణము తనువంటి చనుట

వీరుఁడెఱిగియు గార్యగౌరవముచే నూరక జనియెఁ

బేరోలగమున నున్న దనుజవిభునెదుట రావణి యిడె నతని ॥నారీమణీ॥


చరణములు:

పూని బ్రహ్మాస్త్రమునఁ గట్టుబడె వీఁడు మానులు విఱిచె

వీనిచే దనుజుల్‌ కారాకులు గాలిచే నొరలు గతిఁబడి రనేకులు శాస్తి

వీనికెయ్యదియో వివేకులు జెప్పిన దానిఁ జేయింపు ముల్లోకులు మెచ్చ-

గా నీవనిన సుతుమాట లంకాజాని విని ప్రహస్తుఁడను మంత్రుల-

ఱేని జూచి పలికె వీఁడెవ్వఁడో తానిచ్చటికి వచ్చుటేమో క్రీడా-

కాననముఁ బెఱుకుటేమో సుభటులఁ జంపుటేమో యీ

వానరుని యడుగుమన నతడటులనే యడిగిన వనచర

నేను విడిపింతు నిన్ను భయము మాని నిజమాడు సభలో ననె ॥నారీమణీ॥


రావణా లోకత్రయవిద్రావణ వినరోరి సకల-

జీవహృదయస్థుఁడై మీఱి దేవదేవుఁడౌ శ్రీరామశౌరి పాద-

సేవకుఁడనురా సురారి మా రామావనీంద్రుని నారీమణిని

నీవు శునకము హవిస్సు గొనుగతి దెచ్చినావు ఇట్లా యేలరా చెడిపొ-

య్యేవు ఇంక నా బుద్ధివింటే బ్రతికేవు రఘుపతి ఋష్యమూకమున సు-

గ్రీవుఁడను కపిరాజుతోఁ జెలిమిచేసి యొకతూఁపున-

నే వాలిఁ జంపి కపులకుఁ బతిని జేసి రవిజుని కపిదేవుఁ

డవనిజను జూడ నంపఁగా వచ్చితినిఁ బవనజుఁడనె ॥నారీమణీ॥


కంటి రాతమ్మికంటి సీతను నేనీతోఁట గూల్చితి కొంటెచేష్టల కోఁతినౌట చంపెద

మంటవచ్చి చస్తే నే పూటా అన్నిటికంటె మై ప్రియమను మాట వినవే

వింటి నీ కొడుకు నన్ను సాధించెనంట పొంగినావు బ్రహ్మాస్త్రము

యొంటనంటి చనె నీకు ప్రియము జెప్పేనంట బంధునివలె దయచే వచ్చితి

కంటకపు మతి త్యజింపుము జగము గతి విచారింపుము

బంటకొను మెఱుక నది ముక్తిదము పౌలస్త్యకుల నీ-

వంటివాని కసురత్వము తనువాత్మగా నెన్నుటననె నతఁడు ॥నారీమణీ॥


మేనుకంటెను నేనన్యుఁడని యెంచితేని పరాపరమైన వస్తువౌదువు

గానీకరయఁ బ్రాణబుద్ధీంద్రియదుఃఖశ్రేణి లేదజ్ఞానమె మూలమని

దీని దెలిసితే నీకు మేలు కడలేని దీవి గతిగాను తనువు-

లో నీవున్నావంట యేను తన సంసృతిబంధమగునది

మాను చిన్మాత్రుఁడ నజుఁడ నక్షరుఁడ నేను ఆనందస్వభావుఁడ ననరా

మేను ప్రాణము మనసు మతి మొదలౌనివి భూమి మరుద-

హమిక ప్రకృతి వికారజాతములౌ నందెనయెడు నిరభి-

మాని నిరుపాధికుఁ డీశ్వరుఁడు తానని యెఱుంగ ఘనుడగు ననె ॥నారీమణీ॥


దశముఖ సావధానమతివై యొకటి వినరా ముక్తి

వెసనబ్బు హరిభక్తి గనరా దాన నిశితజ్ఞానము గల్గి మనరా జ్ఞానా-

భ్యసనమునను సోహమనరా దాననసమానభవము చేకొనరా యోరీ

దశరథాత్మజుఁడు ప్రకృతికంటెను పరుఁడు బిసరుహాక్షుఁడు విష్ణుఁడు శ్రీదేవి

వసుధాపుత్రి యా చెలి మున్నిడుకొని రత్నసమూహముతో వచ్చియిచ్చి శరణను

వెస నీవె యపరాధినను మతఁడు శరణాగత ప్రియుఁ

డొసఁగ భయము శేషగిరివిభుఁడు అని పవనసుతుఁ డమృ

తసమానముగఁ బల్కుపల్కుల కసురేంద్రుఁ డలిగి నలి రేగెను ॥నారీమణీ॥




Wednesday, April 17, 2024

బేట్రాయి సామి దేవుడా

 బేట్రాయి సామి దేవుడా – నన్నేలినోడ

బేట్రాయి సామి దేవుడా

కాటేమి రాయుడా – కదిరినరసిమ్ముడా

మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా  ||బేట్రాయి||


శాప కడుపు సేరి పుట్టగా – రాకాసిగాని

కోపామునేసి కొట్టగా

ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి

బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ ||బేట్రాయి||


తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ

దేవాసురులెల్లకూడగా

దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు

సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ ||బేట్రాయి||


అందగాదనవుదులేవయా – గోపాల గో

విందా రచ్చించా బేగరావయా

పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి

కిందు మిందు సేసినోద సందమామ నీవె కాద ||బేట్రాయి||

నారసిమ్మ నిన్నె నమ్మితి – నానాటికైన

కోరితి నీ పాదమే గతీ

ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి

కోర మీసవైరిగాని గుండె దొర్లసేసినోడ ||బేట్రాయి||


బుడత బాపనయ్యవైతివి ఆ సక్కురవరితి

నడిగి భూమి నేలుకుంటివే

నిడువు కాల్లోడివై అడుగు నెత్తిపైన బెట్టి

తడవు లేక లోకమెల్ల మెదిమతోటి తొక్కినోడ ||బేట్రాయి||


రెందుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల

సెండాడినావు పరసుతో

సెందకోల బట్టి కోదందరామసామికాడ

బెండు కోల సేసికొనే కొండకాడకేగినోడ ||బేట్రాయి||


రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి

శ్యామసుందర నిన్ను మెచ్చగా

సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి

ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ ||బేట్రాయి||


దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన

దేవుడై నిలిచినావురా

ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగుడుకొనీ

తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ ||బేట్రాయి||


ఏదాలు నమ్మరాదనీ ఆ శాస్త్రాలా

వాదాలూ బాగలేవనీ

బోధనలూ సేసికొనీ బుద్ధులూ సెప్పుకొనీ

నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద ||బేట్రాయి||


కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన

పలికినావు బాలసిసువుడా

చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర

పిల్లంగోవె సేతబట్టి పేట పేట తిరిగినోడ ||బేట్రాయి ||



Sunday, January 07, 2024

అడుగుల కడ పడి వుండనీ

 అడుగుల కడ పడి వుండనీ

అశ్రులు కన్నుల నిండనీ

అశ్రులతో నీ దివ్య రూపం

అదే పనిగ చూస్తుండనీ!


అదీ ఇదీ ఇమ్మని అడగను

పెదవి కదపనే కదపను

హృదయం నొండా ఆ లావణ్యం

పదిలముగానే దాచుకొందును


నాలోనే హరి హరి హరి హరీ అని 

నామ జపమాల!

శ్రీలోలా!మరి మరి మరి మరి

పూజా మంగళ వేళ


అడుగుల కడ పడి వుండనీ

అశ్రులు కన్నుల నిండనీ

అశ్రులతో నీ దివ్య రూపం

అదే పనిగ చూస్తుండనీ!

Tuesday, January 17, 2017

జయ మంగళం నిత్య శుభ మంగళం

శ్రీరామ మంగళహారతి 
                                                                                   - త్యాగరాజు 

ప||         జయ మంగళం నిత్య శుభ మంగళం    

అ||ప||     మంగళమవని సుత నాధునికి 
             మంగళమరవిందాక్షునికి 
             మంగళమద్భుత చారిత్రునికి 
             మంగళమాది దేవునికి 

చ||        సుందర వదనునికి సుదేహునికి బృందారక గుణ వంద్యునికి
             మందర ధరునికి మన మాధవునికి శుభ ఫలదునికి                   ||జయ||  

చ||        ఇనకులమున వెలసిన రామునికి జనక వచన పరిపాలునికి 
            మనసిజ కోటి లావణ్యునికి కనక సింహాసన నిలయునికి             ||జయ||

చ||        మందానిలభోజ శయనునికి మందాకినీ వర జనకునికి 
            మంద జనక శత సంకాశునికి మందార రూపునికి హరికి            ||జయ||

చ||        ఇంద్రాద్యష్ట దిగీశసుతునికి చంద్రాదిత్య సునయనునికి
            గజేంద్రుని సంరక్షించిన రామ చంద్రునికి జగద్రూపునికి               ||జయ||

చ||        రాజశేఖర ప్రియునికి మౌని రాజరాజ పూజితునికి
            త్యాగరాజ వినుతునికి వర గజరాజాది భక్త వరదునికి                 ||జయ||


Saturday, December 24, 2016

మంగళం తవ భవతు శర్వాణీ

మంగళం తవ భవతు శర్వాణీ 
రచన : నారసింహ కవి 

ప||     మంగళం తవ భవతు శర్వాణీ |మంజుల వాణి|
         మత్త మధుకర నికర నిభవేణీ  ||మహితాబ్జ పాణి||      ||మత్త||

చ||     సనక ముఖ ముని ముఖ్య వన చైత్రీ |సారసనేత్రీ|
         సకల లోక పవిత్ర చారిత్రి |
         మదగణాంచిత కుండల క్షాత్రీ |భాసురగాత్రి|
         మదగణాధిప వదన జనయిత్రీ ||మైనాక పుత్రీ||           ||మద||          ||మంగళం||

చ||     మదన దమన మనీభ్య రోలంబే |గుణమణి కదంబే|
         మహిష దానవ వీర గిరి శంభే |
         మృదుతరార్ణవ కలిత సునితంబే |అధరహిత బింబే|
         అద్భుతాద్భుత రూప జగదంబే ||ఆనందకందే||           || అద్భుతా||      ||మంగళం||

చ||     భవ మహార్ణవ పాఢప ధ్యావే |పావనశీలే|
         పండితోత్తమ భువన సురసారే |
         నవరసోజ్వల కావ్య పరిశీలే |కరుణాలవాలే|
         నారసింహ కవీంద్ర పరిపాలే ||హిమశైల బాలే||       || నార||          ||మంగళం||

Wednesday, December 14, 2016

ఇందుకోటి తేజకీర్ణ

నందిశర్మ చేసిన శ్రీగురు స్తోత్రము

ఇందుకోటి తేజకీర్ణసింధు భక్తవత్సలం |
నందనాత్రిసూనుదత్త మిందిరాక్ష శ్రీగురుమ్ |
గంధమాల్య అక్షతాది వృందదేవవందితమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

మోహపాశ అంధకారజాతదూర భాస్కరమ్ |
ఆయతాక్షపాహి శ్రీయవల్లభేశ నాయకమ్ |
సేవ్యభక్త వృందవరద భూయ భూయ నమామ్యహమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

చిత్తజారి వర్గషట్క మత్తవారణాంకుశమ్ |
సత్త్వసారశోభితాత్మ దత్తశ్రీయ వల్లభమ్ |
ఉత్తమావతార భూతకతృ భక్తవత్సలమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

వ్యోమవాయు తేజ ఆపభూమి కర్తృమీశ్వరమ్ |
కామక్రోధ మోహరహిత సోమసూర్య లోచనమ్ |
కామితార్ధ దాతృ భక్త కామధేను శ్రీగురుమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

పుండరీక ఆయతాక్ష కుండలేందుతేజసమ్ |
చండదురిత ఖండనార్ధ దండధారి శ్రీగురుమ్ |
మండలీక మౌళి మార్తాండ  భాసితాననమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

వేదశాస్త్ర స్తుత్యపాదమాది మూర్తి శ్రీగురుమ్ |
నాదబిందుకళాతీత కల్పపాద సేవ్యయమ్ |
సేవ్యభక్త వృందవరద భూయ భూయ నమామ్యహమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

అష్టయోగ తత్త్వనిష్ఠ తుష్టజ్ఞాన వారధిమ్ |
కృష్ణవేణి తీరవాస పంచనద్య సంగమమ్ |
కష్టదైన్యదూర భక్త తుష్ట కామ్యదాయకమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

నారసింహ సరస్వతీశ  నామ అష్టమౌక్తికమ్ |
హారకృత్య శారదేన గంగాధరాఖ్య స్వాత్మజమ్ |
ధారణీక దేవదీక్ష గురుర్మూర్తి తోషితమ్ |
వందయామి నారసింహ సరస్వతీశ పాహిమామ్ ||

నారసింహ సరస్వతీశ అష్టకంచ యఃపఠేత్ |
ఘోరసంసారసింధు తారణాఖ్య సాధనమ్ |
సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదామ్ | 
చారువర్గ కామ్యలాభ నిత్యమేవ యఃపఠేత్ ||



Tuesday, December 13, 2016

శ్రీ దత్త భజన

దత్త దత్త దత్త దత్త ........

సృష్టి స్థితి లయ కారక దత్త - నానా రూపవిధారక దత్త
యద్వర్జునముఖతారక దత్త - కృష్ణామరజాతీరగ దత్త
గుణమయమాయోద్బోధక దత్త - ఆబ్రహ్మాద్యుత్పాదక దత్త
మోక్షార్హనరాహ్లాదక దత్త - గతరాగద్వేషప్రియ దత్త
స్వేచ్ఛోపాత్త చిదాత్మక దత్త - స్వకథాగాయక తారక దత్త
నామధారక ప్రార్ధిత దత్త - నామధారకాహ్లాదక దత్త
సిద్ధఖ్యాపిత సద్గుణ దత్త - యుగమర్యాదాస్థాపక దత్త
సద్గురు సేవోద్బోధక దత్త - గురుశిష్యకథా శంసక దత్త               ||దత్త దత్త||

దీపకశిష్యోద్ధారక దత్త - మానసపుత్రోత్పాదక దత్త
అత్రిమహర్ష్యాహ్లాదక దత్త - అనసూయానుగ్రాహక దత్త
త్రిమూర్తి వేషవిదారక దత్త - నిజభజకేచ్ఛాపూరక దత్త
మత్స్యాద్యవతారాత్మక దత్త - అగనగధరణీదేశిక దత్త
శిక్షితవాగోత్తమగుణ దత్త - ఆకాశగుణగ్రాహక దత్త
గృహీతనిర్మల జలగుణ దత్త - ఆగ్న్యాచార్యపావక దత్త
చంద్రచ్ఛాత్ర శ్రీగురుదత్త - భాస్కరశిష్య శ్రీగురుదత్త
కపోత శిక్షిత సద్గుణ దత్త - అజగర శిక్షితతోషిత దత్త                   ||దత్త దత్త||

సముద్రశిక్షిత సద్గుణ దత్త - పతంగశిష్య శ్రీగురుదత్త
మధుకృచ్ఛాత్ర శ్రీగురుదత్త - స్వీకృతదంతావలగుణ దత్త
మధుహర శిష్య శ్రీగురుదత్త - మృగశిక్షోంచిత గీతక దత్త
మత్స్యచ్ఛాత్ర శ్రీగురుదత్త - వేశ్యాశిక్షాస్తాశక దత్త
గురురత్యక్త పరిగ్రహ దత్త - బాలకశిష్య శ్రీగురుదత్త
కన్యాకంకణ గుణవద్దత్త - గృహీత సర్వోత్తమగుణ దత్త
శరకారాత్తైకాయన దత్త - గృహీత పేశసృద్గుణ దత్త
వృత్తోర్ణనాభ్యాచారక దత్త - గృహీత దేహోత్తమగుణ దత్త             ||దత్త దత్త||

శ్రీ యదురాజోద్ధారక దత్త - ప్రహ్లాదానుగ్రాహక దత్త
కృతవీర్యాత్మజ తారక దత్త - శ్రీపాద శ్రీ వల్లభ దత్త
మాతాపిత్రాహ్లాదక దత్త - సహోదరానుగ్రాహక దత్త
మహాబలేశ్వర పూజక దత్త - గోకర్ణక్షేత్రాశ్రిత దత్త
కృష్ణవేణీతటగత దత్త  - మూఢద్విజసుతతారక దత్త
శనిప్రదోషక ద్యోతక దత్త  - బ్రహ్మణ్యార్ధితపూరిత దత్త
చౌర సమూహ విఘాతక దత్త  - సంజీవితమృతభూసుర దత్త
ప్రదోష పూజా సుఫలద దత్త  - నృసింహసరస్వతీ సంజ్ఞక దత్త    ||దత్త దత్త||

జనిత ప్రణవోచ్ఛారక దత్త - ప్రకటిత సర్వ శ్రీగుణ దత్త
తత్త్వజ్ఞానోద్బోధక దత్త - మాతాపిత్రేష్టార్పక దత్త
కాశీయాత్రాగామిందత్త - స్వీకృత సన్యాసాశ్రమ దత్త
వేదాంతార్ధోద్భోధక దత్త - యోగాష్టాంగఖ్యాపక దత్త
కృష్ణసరస్వతి చ్ఛాత్రక దత్త  - జననీ దర్శన కారక దత్త
శూలార్త ద్విజ తారక దత్త - సాయందేవాహ్లాదక దత్త
తీర్ధసుసేవాశంసక దత్త  - భాసిత సద్గురు సేవన దత్త
ఛిన్నరసజ్ఞాహ్లాదక దత్త - ద్విజదారిద్య్రదవానల దత్త                   ||దత్త దత్త||

గంగానుజ హృద్హర్షక దత్త - వంధ్యా దోషా శంసక దత్త
పిశాచబాధానాశక దత్త - తత్త్వజ్ఞానాదేశక దత్త
జీవితమృతవిప్రాత్మజ దత్త - వంధ్యా మహిషీ దోహక దత్త
రాజాభీష్ట సుపూరక దత్త - పిశాచతారక సద్గురు దత్త
హృతత్రివిక్రమదుర్మద దత్త - శ్రుత్యుపదేశక తారక దత్త
కర్మవిపాక ద్యోతక దత్త - నారీధర్మ ద్యోతక దత్త
సంజీవితమృత భూసుర దత్త - రుద్రాక్ష మహిత్వోదిత దత్త
నార్యుపదేశ నిషేధక దత్త - సోమవ్రతఫల శంసక దత్త                ||దత్త దత్త||

కర్మకాండ సంజల్పక దత్త - స్వల్పాన్నర్థి విదారక దత్త
వంధ్యాదోష నివారక దత్త - శుష్కకాష్ట సంజీవక దత్త
సాయందేవోద్దారక దత్త  - తంతుకభక్తి ద్యోతక దత్త
కవివరయుగ్మోత్కర్షక దత్త - స్వీకృత సప్తకళేబర దత్త
శూద్రమనోరథపూరక దత్త - గంధర్వపురద్యోతక దత్త
రజకమనోరథపూరక దత్త - శ్రీ గురుచరిత వరప్రద దత్త              ||దత్త దత్త||