Monday, September 09, 2024

భలే ఎలక సవారీ

 భలే ఎలక సవారీ
 
 
రచన : దేవులపల్లి వేంకటక్రిష్ణశాస్త్రి గారు
 
సంగీతం : పాలగుమ్మి విశ్వనాధం గారు
 
పిల్లలు పాడిన పాట
 
 
LYRICS
 
భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో
 
చలో అంటు ప్రతీ ఇంట ఎలా తిరుగుతావో 
 
భలేవాడవీవూ
 
ఏదీ మాకు చూపించు ఏనుగ మొకమూ
 
ఏదీ చంద్రవంక వంటి ఏక దైతమూ
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో        ||భలే ఎలక || 
 
 
చరణం
 
తినాలంటె ఉండ్రాళ్ళూ తీయని అప్పాలూ
 
బనాయించి పోవచ్చూ పంచదార పాలూ
 
క్షణం ఉండు మా ఇంటా అదే కోటివేలూ
 
ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
సరే గాని వినాయకా చదువు సంధ్యలుంటయ్
 
మరీ మరీ పనులుంటయ్ ఆట పాటలుంటయ్ 
 
మరో సారి మనవులివే మాకు అడ్డు రాకూ
 
భరాయించుకోలేమూ పసివాళ్ళం బాబూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
ఫలం ఇచ్చుకుంటామూ పత్రి ఇచ్చుకుంటామూ
 
తలో పూవు కాళ్ళకాడ దాఖలు చేస్తామూ 
 
 
అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం
 
పొలోమంటు పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళూ        ||భలే ఎలక||
 


No comments:

Post a Comment