Monday, September 09, 2024

అమ్మ చేతి పసుపు బొమ్మ

 అమ్మ చేతి పసుపు బొమ్మ

రచన : సామవేదం షణ్ముఖశర్మ గారు
సంగీతం : మల్లాది సూరిబాబు గారు
గానం : భమిడిపాటి లలితా మాధవ్ గారు

అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ
అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ

చరణం
మజ్జగాల నడిపించే గొజ్జు రూపు వేలుపూ 
ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జసామి ఇతడే
వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడూ ......
కొండంత దైవము చలి కొండ చూలి కొడుకూ
||అమ్మ చేతి ||

చరణం
పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడూ
ఒంటి పంటి దేవర మా కంటి రెప్ప ఇతడే
వంకరలను దునుమాడును వంకర తొండమ్ము వాడు
వంక చందురుడు సుమమై 
వరలిన శిగ వాడూ 
||అమ్మ చేతి ||

No comments:

Post a Comment