మంగళం తవ భవతు శర్వాణీ
రచన : నారసింహ కవి
ప|| మంగళం తవ భవతు శర్వాణీ |మంజుల వాణి|
మత్త మధుకర నికర
నిభవేణీ ||మహితాబ్జ పాణి|| ||మత్త||
చ|| సనక ముఖ ముని ముఖ్య
వన చైత్రీ |సారసనేత్రీ|
సకల లోక పవిత్ర
చారిత్రి |
మదగణాంచిత కుండల
క్షాత్రీ |భాసురగాత్రి|
మదగణాధిప వదన
జనయిత్రీ ||మైనాక పుత్రీ|| ||మద|| ||మంగళం||
చ|| మదన దమన మనీభ్య
రోలంబే |గుణమణి కదంబే|
మహిష దానవ వీర గిరి
శంభే |
మృదుతరార్ణవ కలిత
సునితంబే |అధరహిత బింబే|
అద్భుతాద్భుత రూప
జగదంబే ||ఆనందకందే|| || అద్భుతా|| ||మంగళం||
చ|| భవ మహార్ణవ పాఢప
ధ్యావే |పావనశీలే|
పండితోత్తమ భువన
సురసారే |
నవరసోజ్వల కావ్య
పరిశీలే |కరుణాలవాలే|
నారసింహ కవీంద్ర
పరిపాలే ||హిమశైల బాలే|| || నార|| ||మంగళం||