రామదాసు కీర్తన
జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ ||
ఓనమాలు రాయగానే నీ నామమే తోచు | నీ నామమే తోచు శ్రీరామా ||
ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు | అందమె కానవచ్చు శ్రీరామా ||
ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి | మునులెల్ల మోహించిరి శ్రీరామా ||
దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో | దృష్టి తాకును ఏమో శ్రీరామా ||
ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే | నిన్నే భజింప నీవే శ్రీరామా ||
ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు | భక్తి మాత్రమే చాలు శ్రీరామా ||
రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా | నీ తిరువడిగళె కాదా శ్రీరామా ||
నారదాది మునులు పరమపద మందిరిగద | పరమపద మందిరిగా శ్రీరామా ||
సత్య స్వరూపముగ ప్రత్యక్షమైనావు | ప్రత్యక్షమై నావు శ్రీరామా ||
భద్రాచల నివాస పాలిత రామదాస | పాలిత రామదాస శ్రీరామా ||