శివ శివ శివ అనరాదా
రచన
: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు
సంగీతం
: పాలగుమ్మి విశ్వనాథం గారు
గానం
: డా||మహాభాష్యం చిత్తరంజన్ గారు
వేదవతీ
ప్రభాకర్ గారు
శివ
శివ అనరాదా శివ నామము చేద
శివ
పాదము మీద నీ శిరసు నుంచ రాదా
భవసాగర
మీద దుర్భర వేదన ఏదా
కరుణాళుడు
కాదా ప్రభు చరణ ధూళి పడరాదా
హర
హర హర అంటే మన కరువు తీరి పోదా
||శివ
శివ శివ ||
కరి,పురుగు,పాము,బోయ
మొర లిడగా వినలేదా
కైలాసము
దిగివచ్చి కైవల్యము ఇడలేదా
మదనాంతకు
మీదా నీ మన సెన్నడు పోదా
మమకారపు
తెర స్వామిని మనసారా కన నీదా
||శివ శివ శివ ||
No comments:
Post a Comment