శ్రీరామ మంగళహారతి
- త్యాగరాజు
- త్యాగరాజు
ప|| జయ మంగళం నిత్య శుభ మంగళం
అ||ప|| మంగళమవని సుత నాధునికి
మంగళమరవిందాక్షునికి
మంగళమద్భుత చారిత్రునికి
మంగళమాది దేవునికి
చ|| సుందర వదనునికి సుదేహునికి బృందారక గుణ వంద్యునికి
మందర ధరునికి మన మాధవునికి శుభ ఫలదునికి ||జయ||
చ|| ఇనకులమున వెలసిన రామునికి జనక వచన పరిపాలునికి
మనసిజ కోటి
లావణ్యునికి కనక సింహాసన నిలయునికి ||జయ||
చ|| మందానిలభోజ శయనునికి మందాకినీ వర జనకునికి
మంద జనక శత
సంకాశునికి మందార రూపునికి హరికి ||జయ||
చ|| ఇంద్రాద్యష్ట దిగీశసుతునికి చంద్రాదిత్య సునయనునికి
గజేంద్రుని సంరక్షించిన రామ చంద్రునికి జగద్రూపునికి ||జయ||
చ|| రాజశేఖర ప్రియునికి మౌని రాజరాజ పూజితునికి
త్యాగరాజ వినుతునికి వర గజరాజాది భక్త వరదునికి ||జయ||
గజేంద్రుని సంరక్షించిన రామ చంద్రునికి జగద్రూపునికి ||జయ||
చ|| రాజశేఖర ప్రియునికి మౌని రాజరాజ పూజితునికి
త్యాగరాజ వినుతునికి వర గజరాజాది భక్త వరదునికి ||జయ||
Youtube Link : https://www.youtube.com/watch?v=-7022t1PlnY
No comments:
Post a Comment