Monday, September 09, 2024

అమ్మ చేతి పసుపు బొమ్మ

 అమ్మ చేతి పసుపు బొమ్మ

రచన : సామవేదం షణ్ముఖశర్మ గారు
సంగీతం : మల్లాది సూరిబాబు గారు
గానం : భమిడిపాటి లలితా మాధవ్ గారు

అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ
అయ్య ఒడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ

చరణం
మజ్జగాల నడిపించే గొజ్జు రూపు వేలుపూ 
ఒజ్జగ చదువులనిచ్చే బొజ్జసామి ఇతడే
వెండి కొండపై పగడపు వెలుగుల అబ్బాయి వీడూ ......
కొండంత దైవము చలి కొండ చూలి కొడుకూ
||అమ్మ చేతి ||

చరణం
పుష్టి తుష్టి నిచ్చును మా బుద్ధి సిద్ధి విభుడూ
ఒంటి పంటి దేవర మా కంటి రెప్ప ఇతడే
వంకరలను దునుమాడును వంకర తొండమ్ము వాడు
వంక చందురుడు సుమమై 
వరలిన శిగ వాడూ 
||అమ్మ చేతి ||

భలే ఎలక సవారీ

 భలే ఎలక సవారీ
 
 
రచన : దేవులపల్లి వేంకటక్రిష్ణశాస్త్రి గారు
 
సంగీతం : పాలగుమ్మి విశ్వనాధం గారు
 
పిల్లలు పాడిన పాట
 
 
LYRICS
 
భలే ఎలక సవారీ ఎలా ఎక్కుతావో
 
చలో అంటు ప్రతీ ఇంట ఎలా తిరుగుతావో 
 
భలేవాడవీవూ
 
ఏదీ మాకు చూపించు ఏనుగ మొకమూ
 
ఏదీ చంద్రవంక వంటి ఏక దైతమూ
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో
 
ఇదే వచ్చే నీ గుఱ్ఱం ఎలాగెక్కుతావో
 
కదలనీ నీ బొజ్జ నీవు కదం తొక్కుతావో        ||భలే ఎలక || 
 
 
చరణం
 
తినాలంటె ఉండ్రాళ్ళూ తీయని అప్పాలూ
 
బనాయించి పోవచ్చూ పంచదార పాలూ
 
క్షణం ఉండు మా ఇంటా అదే కోటివేలూ
 
ధనాలొద్దు వరాలొద్దు దయ ఉంటే చాలూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
సరే గాని వినాయకా చదువు సంధ్యలుంటయ్
 
మరీ మరీ పనులుంటయ్ ఆట పాటలుంటయ్ 
 
మరో సారి మనవులివే మాకు అడ్డు రాకూ
 
భరాయించుకోలేమూ పసివాళ్ళం బాబూ        ||భలే ఎలక || 
 
 
చరణం
 
ఫలం ఇచ్చుకుంటామూ పత్రి ఇచ్చుకుంటామూ
 
తలో పూవు కాళ్ళకాడ దాఖలు చేస్తామూ 
 
 
అలా కాదు తెమ్మంటే అమ్మనడిగి తెస్తాం
 
పొలోమంటు పరుగెత్తి బోలెడు ఉండ్రాళ్ళూ        ||భలే ఎలక||
 


Saturday, August 31, 2024

శివ శివ శివ అనరాదా

 శివ శివ శివ అనరాదా

 

రచన : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు

సంగీతం : పాలగుమ్మి విశ్వనాథం గారు

గానం  : డా||మహాభాష్యం చిత్తరంజన్ గారు

వేదవతీ ప్రభాకర్ గారు

 

శివ శివ అనరాదా శివ నామము చేద 

శివ పాదము మీద  నీ శిరసు నుంచ రాదా 

భవసాగర మీద దుర్భర వేదన ఏదా

కరుణాళుడు కాదా ప్రభు చరణ ధూళి పడరాదా 

హర హర హర అంటే మన కరువు తీరి పోదా

 

||శివ శివ శివ ||

 

కరి,పురుగు,పాము,బోయ మొర లిడగా వినలేదా

కైలాసము దిగివచ్చి కైవల్యము ఇడలేదా

మదనాంతకు మీదా నీ మన సెన్నడు పోదా 

మమకారపు తెర స్వామిని మనసారా కన నీదా

 

||శివ శివ శివ ||

Saturday, May 11, 2024

వియ్యపురాలి మీద పాట

మంగళం జయామంగళం


Saturday, April 20, 2024

జానకీ రమణ - రామదాసు కీర్తన

రామదాసు కీర్తన


జానకీ రమణ కల్యాణ సజ్జన నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ ||

ఓనమాలు రాయగానే నీ నామమే తోచు | నీ నామమే తోచు శ్రీరామా ||

ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు | అందమె కానవచ్చు శ్రీరామా ||

ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి | మునులెల్ల మోహించిరి శ్రీరామా ||

దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో | దృష్టి తాకును ఏమో శ్రీరామా ||

ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవే | నిన్నే భజింప నీవే శ్రీరామా ||

ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రమే చాలు | భక్తి మాత్రమే చాలు శ్రీరామా ||

రాతి నాతిగ జేసె నీ తిరువడిగళె కాదా | నీ తిరువడిగళె కాదా శ్రీరామా ||

నారదాది మునులు పరమపద మందిరిగద | పరమపద మందిరిగా శ్రీరామా ||

సత్య స్వరూపముగ ప్రత్యక్షమైనావు | ప్రత్యక్షమై నావు శ్రీరామా ||

భద్రాచల నివాస పాలిత రామదాస | పాలిత రామదాస శ్రీరామా ||


నిరవధి సుఖద నిర్మల రూప

 నిరవధి సుఖద నిర్మల రూప - త్యాగరాజకీర్తన 


గానం: మధురై మణి అయ్యర్

రాగం: రవిచంద్రిక 

తాళం: ఆది

కోరిన సభ్యులు: శ్రీ వెలిదండి కాంతారావు



నిరవధి సుఖద నిర్మల రూప

నిర్జిత ముని శాప


శరధి బంధన నత సంక్రందన

శంకరాది గీయమాన సాధు మానస సు-సదన (నిర)


మామవ మరకత మణి నిభ దేహ

శ్రీ మణి లోల శ్రిత జన పాల

భీమ పరాక్రమ భీమ కరార్చిత

తామస రాజస మానవ దూర

త్యాగరాజ వినుత చరణ (నిర)


Friday, April 19, 2024

కలుగునా పద నీరజ సేవ

 కలుగునా పద నీరజ సేవ - త్యాగరాజ కీర్తన

గానం: రాజ్ కుమార్ భారతి

రాగం: పూర్ణ లలిత 

తాళం: ఆది


కలుగునా పద నీరజ సేవ

గంధ వాహ తనయ


పలుమారు జూచుచు బ్రహ్మానందుడై

పరగే భక్తాగ్రేసర తనకు (క)


వేకువ జామున నీ కరముననిడి

శ్రీ కాంతుడమృత స్నానము జేసి

పాకములను శ్రీ రంగేశుని-

కర్పణము జేసి తా

సీతా కరములచే భుజించి నిను

సాత్వీక పురాణ పఠన సేయమనే

సాకేత పతిని సర్వాధారుని

ప్రాకటముగ త్యాగరాజ నుతుని కన (క)