మంగళం జయామంగళం
మా వియ్యపురాలు వన్నెలకు జయామంగళం
మా వదెనె గారి నడతలకు జయామంగళం
చక్కని మా వియ్యపురాలు వయ్యారముగా పెండ్లికి వస్తే
పెండ్లి పందిరి గడ గడ వణికె, దీపములన్నీ ఆరిపోయే
పెండ్లి పందిరి గడ గడ వణికె, దీపములన్నీ ఆరిపోయే
మంగళం జయామంగళం
మా వదెనె గారి నడతలకు జయామంగళం
వన్నెలాడి వియ్యపురాలు వంకర నడకతో కూలబడితే
వన్నెలాడి వియ్యపురాలు వంకర నడకతో కూలబడితే
పక్కన వున్న మంగలి వచ్చి ఎత్తి నిలిపి మన్ను దులిపే
పక్కన వున్న మంగలి వచ్చి ఎత్తి నిలిపి మన్ను దులిపే
మంగళం జయామంగళం
మడిగట్టి మా వియ్యపురాలు తులసి పూజకు వెళుతూయుంటే
మడిగట్టి మా వియ్యపురాలు తులసి పూజకు వెళుతూయుంటే
గాలి వేసి పైట వెసలే అన్న వచ్చి పైట తేర్చే
మా వదెనె గారి నడతలకు జయామంగళం
ప్రేమతో నే అరటిపండు వియ్యపురాలు చేతికి ఇస్తే
తినుట ఎరుగని వియ్యపురాలు తొక్కతో మ్రింగి కక్కుకొనెను
మంగళం జయామంగళం
చింతమాను చిగురే చూడు వియ్యపురాలు మోమే చూడు
చింతమాను చిగురే చూడు వియ్యపురాలు మోమే చూడు
కళ్ళు త్రిప్పుతు మాటలు చూడు వయ్యారంపు నడకలు చూడు
మంగళం జయామంగళం